మనుగడ కోసం పోరాటం
మనుగడ కోసం పోరాటం చేయాల్సిందే ప్రతి ఒక్కరూ. సామాన్య కుటుంబం వారయినా, మద్య తరగతి కుటుంబం వారయినా, ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం వారయినా నిత్యం మనుగడ కోసం పోరాటం చేసే వారే. సామాన్యుడు తన కడుపు నింపుకోడానికి శ్రమ పడుతూ మద్య తరగతి జీవన విధానంలోకి మారాలని పోరాటం, మద్య తరగతి వారు ఉన్నత స్థాయికి చేరాలనే పోరాటం, ఉన్నత స్థాయిలో ఉన్నవారు అదికారం కోసం పోరాటం. తాను గ్రామాద్యక్షుడను కావాలని, యం ఎల్ ఏ కావాలని, ఎం పి కావాలని, మంత్రిని కావాలని, ముఖ్య మంత్రిని కావాలని, ప్రధాన మంత్రిని కావాలని విభిన్న వ్యక్తుల వివిధ మనః స్థాయిలలో, పరిధులలొ ఎవరి పోరాటం వారిదే ఎవరి ఆరాటం వారిదే. ఈ ఆరాట పోరాటాల మద్య కొందరి జీవన రేఖలు మారి పోతుంటాయి. ఉన్నత స్థాయిలో ఉన్న వారు అట్టడుగు స్థాయికి, అట్టడుగు స్థాయిలో ఉన్న వారు ఉన్నత స్థాయి లోకి మారిన వారిని ఎందరినో, మరెందరినో, ఎందరెందరినో మనం చూస్తుంటాం.