మూడు విధానాల సంపాదన
సంపాదన అనేది మూడు విధానాలతో ఉన్నది. మొదటి విధానం ఉద్యోగం చేస్తూ సంపాదించడం, రెండవ విధానం ఉద్యోగంతో సంబంధం లేకుండా వ్యాపారం చేస్తూ సంపాదించడం, మూడవ విధానం ఏమైనా సేవలు అందిస్తూ సంపాదించడం. ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ లేదా ఏమైనా సేవలు అందిస్తున్నపుడు వచ్చే సంపాదన ప్రతి ఒక్కరి ఆనందమైన జీవితం కోసం. కొందరంటారు తనకేమండీ తాను ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాడని, మరికొందరంటారు తనకేమండీ తాను వ్యాపారం చేస్తూ సంపాదిస్తున్నాడని, తాము చేస్తున్న నిర్వహిస్తున్న వృత్తులలోని సాధక బాధకాల తో వ్యాపారం చేస్తున్న వారు ఉద్యోగాలు చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారు వ్యాపారాలు చేస్తున్న వారిని ఒకరిపై ఒకరు ప్రసంశల జల్లులను కురిపిస్తుంటారు. ఎవరు ఏ విధంగా సంపాదిస్తున్నా తమకు వచ్చే సంపాదనలో కొంత మదుపు చేస్తున్న వారే ఏ చీకూ చింతా లేకుండా ఆనందంగా ఉండ గలుగుతారు.