ఆనందకరమైన జీవితం
ఎవరైతే స్వార్ధాన్ని అహంకారాన్ని పోషించి ప్రదర్శించాలి అని అనుకుంటారో వారు శోకంలో, చింతలలో మునుగుతూ ఎదుటి వారికి కూడా దుఃఖాలు పంచుతుంటారు. ఎవరైతే పవిత్రమగు ప్రేమ, ఆప్యాయత, శ్రద్ద, విశ్వాసం, కృతజ్ఞతా భావనలను పోషించుకోవాలి అనుకుంటారో వారు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ, ఎదుటివారి ఆనందమయ జీవితానికి దారి చూపుతారు. ఏ ఆనందం కావాలనుకున్నారో అది నెరవేరితే మంచి జరిగినట్లు సంతోషం కలిగినట్లు, అది నెరవేరక పోతే కష్టం వచ్చినట్లు దుఃఖం కలిగినట్లు ఎదుటి వారిపై అభండాలు చూపుతారు తప్పితే దుఃఖాలకు కారణం తమ తప్పిదాలే అని అని తెలుసుకోరు. ఎవరయితే తమ తప్పిదాలను తెలుసుకొని సరిదిద్దుకుంటారో వారు సంతోషకరమైన, ఆనందకరమైన జీవితంలోకి ప్రవేశిస్తారు.