కావలసిందంతా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండగలిగితేనే




ఆరోగ్యంగా ఉండగలిగితేనే

ఏ పనులు చేయాలన్నా మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే త్వర త్వర గా చేయగలుగుతాం, వ్యాధి సోకినపుడు ఏ పనులు చేయలేము. తగ్గేవరకూ విశ్రాంతి తీసుకుంటాము. అసలు వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలంటే ఆరోగ్యం మన చేతుల్లోనే వున్నది. మన పెద్దలు అవలంభించిన చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలను పాటిస్తుంటే ఏ వైధ్యుని వద్దకు వెళ్ళాల్సిన అవసరం రాదు.


కనీసం నాలుగు ఆరోగ్య సూత్రాలు

మన పెద్దలు అవలంభించిన వాటిలో కనీసం నాలుగు ఆరోగ్య సూత్రాలను పాటించినా చాలు. అవి వేప లేదా గానుగ పుల్లతో మొహం కడుక్కోవడం, రెండవది శారీరక శ్రమ చేయడం, మూడవది ఉదయం చద్దన్నం తినడం, నాలగవది ఇత్తడిబిందెలు, రాగి బిందెలు లేదా కుండలలో నిల్వజేసిన నీరు త్రాగడం


ఐదు దశాబ్ధాల క్రితం వరకు

1970 సంవత్సరం వరకూ మన పెద్దలు శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడకు వెళ్ళాలన్నా కాలి నడకతో మాత్రమే వెళ్ళేవారు. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే సైకిల్ ను ఉపయోగించే వారు తప్పితే మోటర్ బైక్ ను కారును ఉపయోగించేవారు కాదు. నడకతో శారీరక శ్రమ వలన జీవన శక్తి పెరిగి ఎటువంటి అలసటలకు తావులేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఎవరిపై ఆధార పడకుండా తమ పనులను తాము చేసుకోగలిగారు


నేటి స్పీడ్ యుగంలో

అయితే నేటి స్పీడ్ యుగంలో ఇప్పటి తరం వారు ఎక్కడకు వెళ్ళాలన్నా మోటర్ బైక్ ను లేదా కారును ఉపయోగిస్తుండటంతో ఒంటికి తగిన శారీరక శ్రమలు లేకపోవడంతో పనులు సమయానికి పూర్తి చేయలేక మానసిక వత్తిడులకు లోనై అనారోగ్యానికి గురవుతూ వైధ్యులను సంప్రదిస్తున్నారు.


వైరల్ అవుతున్న రీసైకిలింగ్

ఏది కావాలని కొరుకున్నా సమస్తమూ అందుబాటులో ఉన్న నేటి స్పీడ్ యుగంలో మళ్ళీ నీవు పాత పద్దతి లోకి మారి ఆరోగ్యవం తుడవుతావు అనే విషయంతో వున్న వాట్సప్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతున్నది. ఆ వాట్సప్ పోస్ట్ విషయం సారాంశం ఏమిటంటే తగిన శారీరక శ్రమ ఉంటేనే అరోగ్యంగా ఉంటాము. శారీరక శ్రమ లేనిచో అనారోగ్య పాలవుతాము. పనులు అతి శీఘ్రంగా చక్కబెట్టుకోవడానికి గమ్యానికి చేరడానికి ఎటువంటి శారీరక శ్రమ పడకుండా వాహనాలు ఉపయోగించే వారు అనారోగ్య పాలై చివరికి పాత పద్దతిలోకి మారి శారీరక శ్రమ చేస్తూ ఆరోగ్యంగా ఉంటావు అని. ఆ వాట్సప్ పోస్ట్ ఇది. సైకిల్ తొక్కుతుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి మోటర్ బైక్ కొన్నావు. మోటర్ బైక్ నడుపుతుంటే నడుము నొప్పులు వస్తున్నాయని చెప్పి కారు కొన్నావు. కారు డ్రైవ్ చేస్తుంటే బొజ్జ వస్తున్నదని చెప్పి జిమ్ లో జాయిన్ అయ్యావు. అక్కడ ఏమి చేస్తున్నావ్? మళ్ళీ సైకిలే తొక్కుతున్నావు. దీన్నే రీసైకిలింగ్ అంటారు






మొహం శుభ్రం చేసుకోవడం

మనకు వ్యాధులు రావడం నోటి నుండే ప్రారంభం అవుతాయి. నోరు శుభ్రంగా ఉంటే వ్యాధులు రావు. నోరు శుభ్రంగా లేనపుడు మాత్రమే నోటినుండి మనకు వ్యాధులు ఎంటర్ అవుతాయి. జలుబు రావడం, తెమడ ఉత్పత్తి కావడం, ఊపిరితిత్తుల జబ్బులు వంటి రుగ్మతలు నోరు శుభ్రంగా లేనపుడు వచ్చే జబ్బులు. పూర్వ కాలం మన పెద్దలు వేప పుల్ల లేదా గానుగ పుల్లతో పళ్ళు తోముకొని, నాలుకను, అంగిటినీ వేళ్ళతో శుభ్రం చేసుకొని నోటిలో తెమడ లేకుండా శుభ్రం చేసుకునే వారు ప్రతి ఉదయం. నేడు వేప పుల్లలు, గానుగ పుల్లలు ఉపయోగించేవారు తగ్గి పోయి జలుబు లాంటి చిన్న చిన్న రుగ్మతలకు కూడా వైధ్యుల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ.


చద్దన్నం తినడం

మన పూర్వీకులు రాత్రి వండిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయం తినేవారు. ఈ చద్దన్నంలో ఉత్పన్నం అయ్యే మంచి బాక్టీరియ ఆరోగ్యానికి మంచి చేస్తుందని దీనివలన శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ చెడు బాక్టీరియాను డెవలప్ కాకుండా నిరోధిస్తుండంతో వ్యాధుల భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే నేటి తరం వారు మన పెద్దలు చెప్పిన మాట చద్దన్నం మూట గా ప్రక్కన బెట్టి, ఫ్రెష్ ఫ్రెష్ గా వేడి వేడి ఆహార పదార్ధాలను తీసుకుంటూ, శరీరానికి ఎటువంటి పనిచెప్పకుండా, సుకుమారంగా ఉంచుతూ, శరీరంలో యాంటీ బాడీస్ డెవలప్ కాకుండా చేస్తుండటంతో, ఒక్కసారిగా ఏదైనా చెడు బాక్టీరియా ప్రవేశించితే, చెడు బాక్టీరియాని ఎదుర్కొనే యాంటీ బాడీస్ శరీరంలో తగినంత లేక పోవడంతో వ్యాధి బారిన పడి వైధ్యుల చుట్టూ ప్రదక్షణాలు చేసేవారు నేడు ఎందరెందరో ఉన్నారు.


నీరు త్రాగటం

ప్రతి గంటకు కనీసం ఒక అరగ్లాస్ నీరు అయినా త్రాగుతుండాలి. దీని వలన మనలో ఏమైనా చెడుగా ఉన్నవి ఒంటికి ద్వారా లేదా చెమట ద్వారా బయటకు వచ్చేస్తుంటాయి. ఆ త్రాగే నీరు ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉన్న మినరల్ వాటర్ కాకుండా, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు లేదా మట్టి కుండలో నిల్వ చేసిన నీరు త్రాగినపుడు మన ఆరోగ్యానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది


ప్రతి గంటకూ ఒక సారి నీరు త్రాగుతుండాలి

గంట గంటకూ ఒక సారి నీరు త్రాగుతుండటం వంటి విషయం ప్రతి ఒక్కరి విషయంలో ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నీరు త్రాగని వారి విషయం లో మాత్రం జబ్బులు త్వరగా వస్తాయి కనుక ప్రతి ఒక్కరూ గంట గంట కూ నీరు త్రాగుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చైతన్య వంతులై సమాజానికి తమ వంతు కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను.


నేను వ్రాసిన మరి కొన్ని బ్లాగుల లింకులను క్రింద ఇస్తున్నాను, వాటిపై క్లిక్ చేసి వీక్షించవలసినదిగా కోరుచున్నాను.


Bandla App image
Bandla App image
Bandla App image
Bandla App image
మరిన్ని వ్యాసాలు, బ్లాగులకు క్లిక్ చేయండి