చట్ట ధర్మాలకు అంతరాయం లేనప్పుడు మాత్రమే




న్యాయం, ధర్మం

న్యాయ ధర్మాలకు విఘాతం కలగకుండా ఉన్నపుడు మాత్రమే, చట్ట ధర్మాలకు అంతరాయం లేనప్పుడు మాత్రమే ప్రజలు సుఖంగా ఉండగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ న్యాయ ధర్మాలను తు.చ. తప్పకుండా పాటించాలి. ఎవరైనా న్యాయ ధర్మాలను పాటించనపుడది మరొకరికి హానికరమవుతుంది. అందరమూ న్యాయ ధర్మాలను పాటించినపుడు ప్రతి ఒక్కరమూ సుఖ సంతోషాలతో ఉండగలుగుతాము.


ఏది న్యాయం? ఏది ధర్మం?

ఏది న్యాయం? ఏది ధర్మం? అంటే పాలకులు, సామ్రాజ్య నేతలు సూచించిన నియమ నిభందనలు. వీటిని మనం అనుసరించి నపుడు మనం న్యాయ బద్దంగా, ధర్మ బద్దంగా ఉన్నట్లు.


న్యాయ ధర్మాలు మారుతుంటాయి

న్యాయ ధర్మాలు మారుతుంటాయి. ఆరు దశాబ్ధాల క్రితం అంటే 1965 నాటి కాలంలొ రాత్రి సమయాలలో సైకిల్ కు లైట్ తగిలించుకొని నడపాలి. ఇది అతిక్రమించినవారు అంటే లైట్ లేకుండా సైకిల్ నడిపినచో అది నేరం. తర్వాత 1975 నాటి నుండి సైకిల్ కు లైట్ లేకుండా కూడా నడుపుకోవచ్చని పుర పాలకులు ఆజ్ఞలు పాస్ చేశారు. అంటే 1975 తర్వాతి కాలంలో సైకిల్ కు లైట్ లేకుండా నడిపినా అది నేరం కాదు. దీనికి కారణం వీధి వీధికి లైట్ స్తంభాలు రావడంతో సైకిల్ కు లైట్ ఉండాలనే నిబంధనను రద్దు చేశారు అప్పటి పురపాలకులు






ప్రాంతాలననుసరించి వేర్వేరు న్యాయధర్మాలు

న్యాయ ధర్మాలు ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి దేశంలోనూ ఒకే విధంగా ఉండవు. ప్రాంత ప్రాంతానికి, దేశ దేశానికీ ఆయా ప్రాంతాల దేశాల వాతావరణ భౌగోళిక పరిస్తితులను అనుసరించి మారుతుంటాయి. మన భారత దేశంలో మన గమనాలు ఎడమవైపుగా సాగాలి. అదే అమెరికా మరి కొన్ని దేశాలలో వారి గమనాలు కుడి వైపుగా సాగాలి. దీనికి తగ్గట్టుగా మన భారత దేశంలో ఫోర్ వీల్ వెహికిల్ ఎడమ వైపు గమనానికి అనుకూలంగా స్టీరింగ్ కుడి వైపుగా ఉంటుంది . అదే అమెరికాలో అయితే ఫోర్ వీల్ వెహికిల్ అక్కడి కుడి వైపు గమనానికి అనుకూలంగా స్టీరింగ్ ఎడమ వైపుగా ఉంటుంది.


ప్రాంతీయ, దేశీయ నిబంధనలు తెలుసు కోవాలి

మనం మన భారత దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్ళలన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా అట్లానే విదేశాలకు ఏ దేశానికి వెళ్ళాలన్నా ముందుగా మనం ఆయా ప్రాంతాల, రాష్ట్రాల, దేశాల నిబంధనలు తెలుసుకొవాలి. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఆయా ప్రాంతాల, రాష్ట్రాల, దేశాల న్యాయ సూత్రాలను పాటించాలి. మన భారత దేశంలో మనం స్థానికంగా ఉన్న ప్రాంతాలలలో పాటిస్తున్న న్యాయ సూత్రాలను అక్కడ పొరుగు రాష్ట్రాల పర్యటనలో, విదేశాల పర్యటనలో ఆయా దేశాలలో, రాష్ట్రాలలో, ప్రాంతాలలో పాటిస్తే నేరమవుతుంది. ఎందుకంటే అక్కడి ప్రాంతాల, రాష్ట్రాల, దేశాల న్యా య సూత్రాలు వేరే విధంగా ఉండటం వలన. కనుక వేరే ప్రాంతాలకు, విదేశాలకు వెళ్ళినపుడు తప్పనిసరిగా అక్కడి న్యాయ సూత్రాలను తెలుసుకొని మసలు కోవాలి. ఎవరైనా న్యాయధర్మాలకు విఘాతం కలిగించినపుడు అవి మరొకరి హక్కులకు భంగకరంగా మారి కష్ట నష్టాలతో ఎంతో ఆవేదనకు గురి చేస్తాయి.


నేను వ్రాసిన మరి కొన్ని బ్లాగుల లింకులను క్రింద ఇస్తున్నాను, వాటిపై క్లిక్ చేసి వీక్షించవలసినదిగా కోరుచున్నాను.


Bandla App image
Bandla App image
Bandla App image
Bandla App image
మరిన్ని వ్యాసాలు, బ్లాగులకు క్లిక్ చేయండి