మానసిక అలసటను అధిగమించడానికి




నూతన ఉత్సాహానికి ఉత్తేజానికి

నూతన ఉత్సాహానికి ఉత్తేజానికి, మానసిక అలసటను అధిగమించడానికి విహార యాత్రలు ప్రతి ఒక్కరికి అవసరం. దైనందిన జీవితంలో నిత్యము అనేక వ్యవహారాలలో తనమునకలవుతూ బిజీ బిజీగా ఉన్న జీవితానికి మానసిక అలసటను అధిగమించటానికి విహారయాత్రలకు మించిన ఔషధం లేదు. దైనందిన జీవితాల నుండి రిలాక్స్ కొరకు విహార యాత్రలు పిక్నిక్ లు చేయటం తప్పనిసరి ప్రతి ఒక్కరికీ.


రొటీన్ లైఫ్ నుండి రిలాక్స్

విహార యాత్రలు వలన మన రొటీన్ లైఫ్ నుండి రిలాక్స్ అవడమే కాకుండా, అక్కడి వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి గమనించి, క్రొత్త క్రొత్త విషయాలు కూడా తెలుసుకుంటాం.


నాణ్యతా ప్రమాణాలు పెంపొందించుకోవడానికి

కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల నాణ్యతా ప్రమాణాలు పెంపొందించుకోవడానికి మధ్య మధ్యలో వేరే వేరే ప్లేసులకు, యాత్రలకు, విహార యాత్రలకు, పిక్‍నిక్ లకు పంపుతూ, సంస్థల అభివృద్దితో పాటు ఉద్యోగుల మనో వికాసాలకు తోడ్పడుతున్నారు. అదే విధంగా విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకెళ్తుంటే పుస్తకాలలో చదివిన విషయాలను ప్రత్యక్ష్యంగా వీక్షించడం తో వారి ఆలోచనాశక్తి బలంగా మారుతుంది. చదువులపై ఉత్సాహం పెరుగుతుంది,


కొత్త విషయాలను తెలుసుకుంటారు

కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్నేహితులు గ్రూపులుగా కూడా కలసి విహార యాత్రలు చేస్తూ తమకు తెలియని కొత్త విషయాలను తెలుసుకుంటూ తమ పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రొత్త ఉత్సాహంతో తమ జీవితాలను ఆనందమయం చేసుకుంటున్నారు.


మీ అభిప్రాయాలు తెలియజేయండి

బందు మిత్రులతో అపుడపుడు సాగిన మా విహారయాత్ర ల వీడియోలను యూట్యూబ్ లో ఇప్పటి వరకూ పోస్ట్ చేసినవి, ఇక్కడ ఈ వెబ్‍సైట్ టూర్ విభాగంలో కూడా ఆ యూట్యూబ్ వీడియోల లింకులను పబ్లిష్ చేస్తున్నాము. మా విహారయాత్ర ల వీడియోలను వాటిని వీక్షించి మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము






మా పిక్‍నిక్ లు , విహార యాత్రల పర్యటనలకు సంబందించి యూట్యూబ్ బండ్ల చానల్ లో అప్‍లోడ్ చేసిన కొన్ని వీడియోల లింకులను క్రింద ఇస్తున్నాము. వాటిని వీక్షించి కామెంట్ చేయవలసినదిగా కోరుచున్నాను.


Bandla Tour image
Bandla Tour image
Bandla Tour image
Bandla Tour image
మరిన్ని పర్యటనలు విహార యాత్రల వీడియోలు కొరకు క్లిక్ చేయండి

నేను వ్రాసిన మరి కొన్ని బ్లాగుల లింకులను క్రింద ఇస్తున్నాను, వాటిపై క్లిక్ చేసి వీక్షించవలసినదిగా కోరుచున్నాను.


Bandla App image
Bandla App image
Bandla App image
Bandla App image
మరిన్ని వ్యాసాలు, బ్లాగులకు క్లిక్ చేయండి