హోమ్
వ్యాసాలు
బయోగ్రఫీలు
వివిధ భాషలలో
విహారి
భక్తి
వీడియోలు
మూసలు
ఆనందం పరమానందం
హోమ్
నాగురించి
సంప్రదించండి
వ్యాసాలు
బయోగ్రఫీలు
వివిధ భాషలలో శుభాకాంక్షలు
భక్తి
వీడియోలు
మూసలు
ఆనందం పరమానందం
విహారి
నిరాకరణ
గోప్యత
నిబంధనలు
దయలేని వారు మీ ఆడవారు
పాపం మీరు దయా దాక్షిణ్యాలు గల
మానవులు కాబోరునేం
షేర్ చేయండి
Tweet
పుష్ప విలాపం
దయలేని వారు మీ ఆడవారు పాపం మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు కాబోరునేం అని అంటున్నారు కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తన "పుష్ప విలాపం" లో పువ్వులను తెంచడం, పువ్వులను తుంచడం, పువ్వులను కోయడంతో పువ్వులు పడే బాధను వర్ణిస్తూ కరుణ శ్రీ జంఢ్యాల పాపయ్య శాస్త్రి గారు తన "పుష్ప విలాపం" లో అంటున్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నది. ఈ "పుష్ప విలాపం" పాటను వినగానే మనలో కొందరైనా ఇకనుండి పువ్వులను మొక్కనుండి వేరుచేయరాదు అనే నిర్ణయానికి వస్తారు. ఈ "పుష్ప విలాపం" ను మహానుభావులు స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గానం చేసారు. ఈ "పుష్ప విలాపం" ను కరుణ శ్రీ జంఢ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసారు. ఈ "పుష్ప విలాపం" ను నేను నానుండి మీకు వినిపిస్తున్నాను. నానుండి ఏవిధంగా ఉన్నదీ కామెంట్ రూపంలో తెలియజేయ వలసిందిగా కోరుతున్నాను.
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి
వెళ్ళాను ప్రభూ! ఉదయ శ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం
కళకళలాడుతోంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా
ఆడుకుంటున్నవి. అప్పుడు
నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతూ; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.
అంతలో ఒక సన్నజాజికన్య సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభూ!
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.
ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డు వస్తావ్ మేం మీకేమపకారం చేసాం
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!
ఇంతలో ఒక గులాబిబాల కోపముతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభూ!
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకటా! దయలేని వారు మీ ఆడవారు
పాపం మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు కాబోరునేం
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె;
మా వెలలేని మా యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి
మమ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !
ఓరి మానవుడా!
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసే హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.
అని దూషించి పూల కన్నియల కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా యీ హృదయ కుసుమాంజలిని గైకొనొని నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరింప జేయుము ప్రభూ!
ప్రభూ! ..... ....... ....... ......... .......
మరి కొన్ని పాటల లింక్స్ క్రింద ఉన్నవి. ఆ లింకులను కూడా క్లిక్ చేసి వీక్షించండి. మీ కామెంట్స్ తెలియజేయండి.
© All rights reserved to www.bandla.app