ప్రతి భర్త తన బార్యకు ఇచ్చే మల్లెల
కుసుమాల ఆరాధనల దండ ఈ పాట




           




                                                        




తిన్నవా లేదా అని అడిగానా ఎపుడైనా..

ప్రతి భర్త తన బార్యకు ఇచ్చే మల్లెల కుసుమాల ఆరాధనల దండ ఈ పాట. మీకు వివాహమై అనేక సంవత్సరాలు లేదా అనేక దశాబ్ధాలు గడచిపోయి ఉండవచ్చు గడచి పోయిన మీ సంసార జీవన యాత్రను ఒకసారి నెమరువేసుకొని జ్ఞప్తికి తెచ్చుకొని మీరు మీ భార్యను సహాత్మలాగా చూసుకున్నారా లేదా అని ఒక ప్రశ్న వేసుకున్నపుడు లేదా ఒక సద్విమర్శన చేసుకున్నపుడు లేదా ఒక ఆత్మ విమర్శన చేసుకున్నపుడు ఉద్భవించిన వచ్చే మీ మధుర సృతుల జ్ఞాపికలు మీరు మీ భార్యకు అట్లానే ప్రతి భర్త తన భార్యకు ఇచ్చే మల్లెల కుసుమాల ఆరాధనల దండ ఈ పాట. ఈ పాటను రసరాజు గారు వ్రాసారు. ఈ పాటను నా నుండి మీకు వినిపిస్తున్నాను నా ద్వారా ఈ పాట ఏ విధంగా ఉన్నదీ కామెంట్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను

తిన్నవా లేదా అని అడిగానా ఎపుడైనా..
నడుం వాల్చలేదేమని అన్నానా ఎపుడైనా..

చీర నీకు బాగుందని పొగిడానే గానీ
ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎపుడైనా

ముసురువేళ వేడివంట తిన్నానే గానీ
నీ ప్రేమకింత రుచిఉందని అన్నానా ఎపుడైనా..

జడలో మల్లెల వాసన పీల్చానే గానీ
నీ మనసులోని పరిమళాన్ని చూసానా ఎపుడైనా..

బండచాకిరీ నీదని భావించానే గానీ
నీ అలసట తుడిచి ముద్దు పెట్టానా ఎపుడైనా..

అర్దాంగివి కావు నీవు అనురాగ దేవతవు
ఈ గజలును నేనై ఈ నిజాన్ని రాస్తానా ఎపుడైనా..




మరి కొన్ని పాటల లింక్స్ క్రింద ఉన్నవి. ఆ లింకులను కూడా క్లిక్ చేసి వీక్షించండి. మీ కామెంట్స్ తెలియజేయండి.