అందమైన జీవితం
మన జీవితాన్ని మనమే అందంగా మలుచుకోవచ్చు. గతం ఎలా జరిగినా - జరిగినది మంచైనా, చెడు అయినా విడిచి పెట్టండి. జరగ బోయేది గడచి పోయిన దానికంటే ఇంకా అందంగా మార్చుకోవాలని, ఈ బ్లాగ్ చదువుతున్న ప్రతి ఒక్కరికీ తెలియ జేస్తున్నాను జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకోవాలని. మనకు జరగబోయే జీవితాన్ని, మన శేష జీవితాన్ని గడచి పోయిన దానికంటే అందంగా మార్చుకోవాలంటే, అందమైన మార్పులతో మన జీవితం సాగి పోవటానికి మనమిపుడు మునిగి పోయిన వ్యాపకాలను కొనసాగిస్తూనే, అవే కాకుండా వాటితో పాటు మరో క్రొత క్రొత్త వ్యాపకాలను సృష్టించు కోవడమే! అందుకు చిత్ర లేఖనం కావచ్చు, నాట్యమాడటం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, కవితలు వ్రాయడం కావచ్చు, వ్యాసాలు వ్రాయడం కావచ్చు, ఉపన్యాసాలు ఇవ్వడం కావచ్చు, నటించడం కావచ్చు ఏదైనా ఒక వ్యాపకానికి స్వాగతం పలుకుదాం. అవి మంచిగా రావడానికి ప్రతి రొజూ వాటి సాధనలతో మన శేష జీవితాన్ని సంతోషంగా సంపూర్ణం చేద్దాం.